పోలవరం కేంద్రమే కట్టాలని చట్టంలోనే ఉంది

ఏపీ అసెంబ్లీ: పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే కట్టాలని విభజన చట్టంలో ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరం ప్రాజెక్టుపై ఆయన మాట్లాడారు. వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి తన సమాధానం చెబుతూ..కేంద్ర ప్రభుత్వం పోలవరం కట్టేందుకు ఆమోదం చెప్పిందని ఇప్పుడే ఏదో ఇష్యూ జరిగినట్లుగా గొప్పగా చెబుతున్నారు. ఇది చట్టం. ఏపీ రీ ఆర్గనైజేషన్‌లో చట్టం చేశారు. పార్లమెంట్‌ ఆమోదం పొందిన యాక్ట్‌లో పోలవరం నిర్మించాలని ఉంది. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో యాక్ట్‌లో చేర్చారు. జాతీయ ప్రాజెక్టుగా డిక్లైర్‌ చేసిన తరువాత కేంద్రం చేయాల్సిన బా«ద్యత ఉంది. మార్చి 2న 2014న కేబినెట్‌ మీటింగ్‌ పెట్టి మూడు తీర్మానాలు చేశారు. అందులో ఒకటి ముంపు మండలాలను ఇటువైపు కలపాలన్నది ఒక అంశం. ప్రత్యేక హోదాను కూడా ఏపీకి ఇవ్వాలని ప్లానింగ్‌ కమిషన్‌కు ఆదేశాలు కూడా జారీ చేశారు. నిన్న మోడీ ఆధ్వర్యంలో కేబినెట్‌ ఆమోదం పొందిందని గొప్పగా చెబుతున్నారు. మీరు 2010–2011 ప్రకారం మీరు పిలిచిన టెండర్లకు పవర్‌ కాంపోనెట్, డ్రికింగ్‌ కాంపోనెంట్, అలాగే గతంలో ఖర్చు చేసిన రూ.500 కోట్లు మేం ఇవ్వడం లేదని కేంద్రం చెప్పింది.

Back to Top