బ్రాహ్మణుల గౌరవాన్ని కాపాడిన మహోన్నత వ్యక్తి వైయస్‌ఆర్‌..

విశాఖ‌: బ్రాహ్మణులకు గౌరవాన్ని ఎవరన్నా ఇచ్చారంటే అది మహానేత దివంగత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని తెనాలికి చెందిన పురుషోత్తమ శర్మ అన్నారు.రాజమ్రండి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ గతంలో బ్రాహ్మణ సంఘం సమావేశంలో చెప్పిన జ్ఞాపకాన్ని గుర్తుచేశారు. వైయ‌స్ రాజారెడ్డి తో చెస్‌ ఆడుతున్నప్పుడు ఒక వ్యక్తి అటుగా వెళ్తూ ఏ పంతులు పక్కకు జరుగు అని అమర్యాదగా అన్నాడని ఆ వ్యక్తి వైయ‌స్‌  రాజశేఖర్‌ రెడ్డి గారికి సన్నిహితుడైన ప్రముఖ వ్యక్తి అని.. ఆయనను పిలిచి.. పిలిస్తే పంతులుగారూ అని గౌవరంగా పిలవాలని. లేకపోతే అరుణ్‌కుమార్‌ గారు అని గౌరవంగా పిలవాలని, పంతులు అంటే నా గడప తొక్కొద్దు అంటూ నిక్కచ్చిగా చెప్పారని గుర్తు చేశారు. వైయస్‌ఆర్‌కు బ్రాహ్మణులంటే ఎంత గౌరవభావమో తెలుస్తుందన్నారు. అలాగే తెనాలిలో ఎందుకు బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి వైయ‌స్ జగన్‌ ముఖ్యఅతిథిగా రావాలని కొందరు ప్రశ్నించారని కార్పొరేషన్‌ స్కాలర్‌షిప్‌ వస్తున్న విద్యార్థులను  వెళ్లొద్దంటూ బెదిరింపులకు దిగినట్లు తెలిపారు.  రాజధానిలో బ్రాహ్మణ భవన్‌ నిర్మించాలన్నారు. అని నియోజక వర్గాల్లో బ్రాహ్మణులకు ఉపయోగపడే విధంగా వైయస్‌ఆర్‌ స్మారక భవనాలను నిర్మించాలని కోరారు.అదేవిధంగా రాజధానికి వచ్చే అర్చకులు, పురోహితులు కోసం వారి మడి ఆచారాలు కోసం 11 ఎకరాల లో బ్రాహ్మణ భవనం నిర్మించాలన్నారు.
 
Back to Top