'తెలంగాణలో బలపడుతున్న వైయస్‌ఆర్‌ సిపి'

మహబూబ్‌నగర్‌, 15 నవంబర్‌ 2012: తెలంగాణలో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ బలమైన శక్తి ఎదుగు‌తున్నదని వైయస్‌ఆర్‌సిపి కేంద్ర పాలకమండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. మైనార్టీలో పడిపోయిన ఈ అసమర్థ రాష్ట్ర  ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడానికి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెనకాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎంఐఎం తన మద్దతును ఉపసంహరించడంతో రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలో పడిందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్‌లో గురువారం జరిగిన వైయస్‌ఆర్ సీపీ విస్తృతస్థాయి సమావేశంలో జిట్టా బాలకిష్టారెడ్డి,‌ కె.కె. మహేందర్‌రెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, బాలమణెమ్మ, బాజిరెడ్డి, భూమన పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో‌ జరగనున్న షర్మిల పాదయాత్రకు సంబంధించి ఏర్పాట్లపై వీరు చర్చించారు. తెలంగాణ తెస్తానంటూ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని జిట్టా బాలకిష్టారెడ్డి ఆరోపించారు.
Back to Top