వైయస్‌ఆర్ జిల్లా: ఉపాధ్యాయ సమస్యల పరిస్కారం కోసం నిరంతర కృషి చేస్తానని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి కేవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. చెన్నూరు బాలుర, బాలికల, రామనపల్లె, కొండపేట, చిన్నమాచుపల్లె ఉన్నత పాఠశాలల్లో ఆయన ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న సీపీఎస్ రద్దు, ఏకీకృత సర్వీస్ రూల్స్, ఎయిడెడ్ టీచర్లకు నిధుల సమస్యలేకుండా చేయడం, మోడల్ స్కూల్స్‌కి వార్డన్‌ల కేటాయింపు రెసిడెన్సియల్ స్కూల్స్‌లో సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్ లెక్చిరర్‌లు, టీచర్స్‌కి పీఆర్‌సీ వర్తింపు వంటి అనేక సమస్యల పరిస్కారం కోసం పని చేస్తానని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతిచ్చి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ టీచర్స్ యూనియన్ జిల్లా అ«ధ్యక్షుడు రమణారెడ్డి, ఎంఈఓ క్రిష్ణమూర్తి, నరహరిశర్మ, రామసుబ్బారెడ్డి, రెడ్డెయ్య, శ్రీనివాసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. <br/>