టీడీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పండి

క‌ర్నూలు:  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి గుణపాఠం చెబుదామని ఆదోని ఎమ్మెల్యే సాయిప్ర‌సాద్‌రెడ్డి పిలుపునిచ్చారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న పట్టభద్రుల పశ్చిమ రాయలసీమ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై వుందన్నారు. గతంలో గోపాల్‌రెడ్డి రాష్ట్ర ఎన్జీఓస్‌ సంఘం అధ్యక్షుడిగాను, భారత సైన్యంలో కొంత కాలం ప్యారాట్రూవర్‌గా పని చేశారని చెప్పారు. 19912004 వరకు కోఆపరేటివ్‌ డిపార్ట్‌మెంట్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పని చేశారన్నారు. జేఏసీ ఛైర్మన్‌గా వుంటూ కార్మిక, పెన్షనర్లకు ఎనలేని సేవలు అందించిన ఘనత గోపాల్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఏపీ ఎన్జీఓస్‌ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగారన్నారు. ఉద్యోగిగా, ఉద్యోగుల సంఘం నాయకుడిగా సుధీర్ఘ కాలం పని చేసిన అనుభవం ఎంతో వుందన్నారు. నిస్వార్థంగా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం వల్లనే  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. గోపాల్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని, అందుకు పట్టభద్రులు, ఉద్యోగులు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఆదోని నియోజక వర్గంలో 3786 మంది పట్టభద్రులు వున్నారని చెప్పారు. అందులో దాదాపు 80 శాతం మేర ఓటర్లు వెన్నపూస గోపాల్‌రెడ్డికే తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఓటు వేసేముందు ఒక్క నిమిషం పాటు మేధావులు, ఓటర్లు ఆలోచించాలన్నారు.     

Back to Top