ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం చెప్పాలి

నందికొట్కూరు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే ఐజయ్య కుమారుడు, వైయస్‌ఆర్‌ సీపీ యువనేత చంద్రమౌళి నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహాంలో ఏర్పాటు చేసిన పార్టీ యువత, విద్యార్థి విభాగం ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఎన్నికల హామీలను విస్మరించిన టీడీపీపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలే వైయస్‌ఆర్‌ సీపీ తరుపున పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థిగా పోటి చేసే వెన్నపూస గోపాలరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. 2014 ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి కింద నెలకు రూ, 2 వేలు ఇస్తామని చెప్పి అధికారం చేపట్టిన సీఎం చంద్రబాబు నాయుడు 33 నెలలు గడుస్తున్న ఒక పైసా కూడ ఇవ్వలేదని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే నంద్యాల షుగర్‌ ఫ్యాక్టరీ, కర్నూలు పేపర్‌ మిల్‌ను పునఃప్రారంభిస్తామని చెప్పిన సీఎం ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. సీఎం తరహలోనే టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కేజీ రెడ్డి నిరుద్యోగులకు ఇచ్చే మోసపూరిత హామీలను నమ్మవద్దన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ తరుపున బరిలోకి నిలిచిన వ్యక్తి ఆర్మీలో దేశం కోసం పనిచేసి క్రమశిక్షణ కలిగిన వెన్నపూస గోపాలరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించి వైయస్‌ జగనన్నకు కర్నూలు జిల్లా నుంచి కానుకగా ఇవ్వాలని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమారెడ్డి, జిల్లా నాయకులు కోకిల రమణారెడ్డి, ఆయా మండలాల కన్వీనర్లు చౌడయ్య, రమాదేవి, నాయకులు మోహన్‌రెడ్డి, భాస్కరరెడ్డి, సాయిరాం, రమణ, బంగారం, ఏసన్న, అచ్చెన్న, అబ్రహాం, రాజేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top