కాకినాడ‌లో ఓట‌ర్ల‌ను బెదిరిస్తున్న టీడీపీ

కాకినాడః కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో గెలిచేందుకు తెలుగుదేశం స‌ర్కార్ కాకినాడ ఓట‌ర్ల‌ను బెదిరింపుల‌కు గురించేస్తుంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి మండిప‌డ్డారు. త‌మ పార్టీకి ఓటు వేయించాల‌ని అధికారుల‌పై కూడా ఒత్తిడి తీసుకొస్తుంద‌ని విమ‌ర్శించారు. కాకినాడ‌ల ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. అంగ‌న్‌వాడీ, మెప్మా వ‌ర్క‌ర్ల‌పై ప్ర‌భుత్వ ఒత్తిడి విప‌రీత‌మైంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. యువ‌కుల‌ను త‌మ వైపు తిప్పుకునేందుకు టీడీపీ ప్ర‌భుత్వం వారిని మ‌ద్యానికి బానిస‌లు చేస్తుంద‌న్నారు. ఓటుకు రూ. 2 వేల చొప్పున పంపిణీ చేస్తున్నార‌ని చెప్పారు. మూడున్న‌ర సంవ‌త్స‌రాలుగా డ్వాక్రా మ‌హిళ‌ల‌ను క‌న్నీళ్లు పెట్టించిన చంద్ర‌బాబు కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు రాగానే వారి అకౌంట్ల‌లో డ‌బ్బులు జ‌మ చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. టీడీపీ కుట్ర‌ల‌పై ఎన్నిక‌ల సంఘం చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. చంద్ర‌బాబు ఎన్ని కుయుక్తులు ప‌న్నినా వైయ‌స్ఆర్ సీపీ విజ‌యాన్ని ఆప‌లేర‌న్నారు. 

Back to Top