ఓట‌మి భ‌యంతో పారిపోయిన టీడీపీ

ప్రొద్దుటూరు :  ఓట‌మి భ‌యంతో తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక‌ను వాయిదా వేయించుకొని పారిపోయింది. మున్సిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌వి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ‌కాశం ఉండ‌డంతో ఎన్నిక‌ను వాయిదా వేయాల‌ని టీడీపీ స‌భ్యులు ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ఎన్నిక‌ల హాల్‌లో కుర్చీల‌ను ధ్వంసం చేశారు. వైయ‌స్ఆర్ సీపీ, టీడీపీ వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవ‌డంతో శాంతిభ‌ద్ర‌త‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని ఎన్నిక‌ల అధికారులు రేప‌టికి వాయిదా వేశారు. టీడీపీ కౌన్సిల‌ర్లు రూల్స్‌కు వ్య‌తిరేకంగా, దౌర్జ‌న్యంగా మినిట్స్ బుక్‌ను లాక్కువెళ్లారు. చైర్మ‌న్ ప‌ద‌వికి టీడీపీకి అంత‌గా బ‌లం లేక‌పోయినా వైయ‌స్ఆర్ సీపీ కౌన్సిల‌ర్‌ను ప్ర‌లోభాల‌కు గురిచేసి లాక్కునేందుకు ప్ర‌య‌త్నించింది. దీంతో వైయ‌స్ఆర్ సీపీ విప్ జారీ చేయ‌డంతో టీడీపీకి మ‌ద్ద‌తు ప‌లికిన కౌన్సిల‌ర్లు తిరిగి సొంత‌పార్టీ గూటికి చేరుకున్నారు. మెజార్టీ లేక‌పోయినా చైర్మ‌న్ ప‌ద‌వి లాక్కోవ‌డానికి కుట్ర‌లు ప‌న్నుతున్న చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌పై వైయ‌స్ఆర్ సీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రాజ్యాంగ విలువ‌ల‌ను తుంగ‌లో తొక్కుతుందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Back to Top