<br/><strong>ఎన్నికల ప్రధానాధికారికి ఎమ్మెల్యే గోపిరెడ్డి ఫిర్యాదు..</strong><br/><strong>అమరావతిః </strong> ఏపీ వ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీ ఓట్లను లిస్ట్ నుంచి తొలగిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితా నుంచి వైయస్‌ఆర్‌సీపీ ఓట్లను టీడీపీ నేతలు తొలగిస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఓట్లను తొలగించి అడ్డదారిలో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. ప్రతి నియోజకవర్గంలో 5వేల ఓట్లు తొలగించేందుకు యత్నిస్తుందన్నారు. ఓట్లను తొలగించేందుకు టీడీపీ జౌట్‌సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకుందన్నారు. .వైయస్‌ఆర్‌సీపీ ఓట్లను తొలగించి టీడీపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక టీడీపీ అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. వైయస్‌ఆర్‌సీపీ ఓట్ల తొలగింపుపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు