<strong>నెల్లూరు:</strong> రానున్న ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేత శ్రీనివాసులు, వంద మంది కార్యకర్తలతో కలిసి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు మోసాలను తట్టుకోలేక అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష వైయస్‌ఆర్‌సీపీలో చేరుతున్నారన్నారు. చంద్రబాబు పార్టీకి ఓటమి తప్పదని, వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో రాజన్న రాజ్యం వస్తుందన్నారు.