టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

 
 

చిత్తూరు: అధికార తెలుగు దేశం పార్టీకి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో షాక్‌ తగిలింది. చంద్రగిరి నియోజకవర్గం చిన్నగిట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వీరు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. వీరికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన వస్తుందని పెద్దిరెడ్డి తెలిపారు. వైయస్‌ జగన్‌ ప్రజల కోసం చేస్తున్న పోరాటాలకు వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలో చేరుతున్నారన్నారు. 
 
Back to Top