నెల్లూరు: ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరులో ఏర్పాటు చేసిన యువభేరి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కారు కుట్రలకు తెరలేపింది. యువభేరి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా భారీగా తరలివస్తున్న విద్యార్థులను అధికారులు అడ్డుకున్నారు. విద్యార్థుల బస్సులను అడ్డగించారు. బస్సులను వదలకపోతే ధర్నాకు దిగుతామని వైయస్సార్ సీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.