జనం మెచ్చిన జగన్మోహనుడిపై పచ్చకుట్రలు..!

ఉవ్వెత్తిన ఎగసిన కెరటంలా ఉద్యమం..!
హోదా సాధించేదాకా విశ్రమించేదిలేదన్న జననేత..!

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా సాధన కోసం ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పోరు రోజురోజుకు ఉధృతమవుతోంది. హోదాపై  వైఎస్ జగన్ చేస్తున్న పోరాటాలను అణగదొక్కేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నకొద్దీ... ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది. ప్రత్యేకహోదా సాధించేదాకా విశ్రమించేది లేదని వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇస్తున్నారు.  హోదాను సాధించేందుకు కంకణబద్దులై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తన పోరాటపటిమ చూపుతున్నారు.  

మరింతగా ముందుకు..!
ప్రత్యేకహోదా ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు వైఎస్సార్సీపీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. ఈనెల 17 నుంచి 21 వరకూ అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు జరపనున్నారు. 18న నియోజకవర్గాల్లో ర్యాలీలు, 19న నియోజకవర్గ కేంద్రాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహిస్తారు. 20వ తేదీ సాయంత్రం కొవ్వొత్తులతో ర్యాలీ తీస్తారు.  21న బస్సు డిపోల ముందు ధర్నాలు చేపడుతారు.

యువత తోనే సాధ్యం..!
ప్రత్యేక హోదా అన్నది యువత, ఈ తరం విద్యార్థులకు అవసరమైన విషయం. అందుచేత ఈ ఉద్యమంలో యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున భాగస్వాములు అవుతున్నారు. ప్రత్యేక హోదా తెచ్చుకొంటే వేలాది పరిశ్రమలు, లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. అందుకే యువత పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతోంది.
Back to Top