వైయస్‌ఆర్‌ సీపీలో టీడీపీ కుటుంబాల చేరిక

చిత్తూరు: సోమల మండలంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న గంగిరెడ్డిపురం గ్రామంలో తంబళ్లపల్లె నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి పెద్దిరెడ్డి ద్వారాకనాథరెడ్డి ఆధ్వర్యంలో 15 కుటుంబాలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరాయి. వీరందరికీ ఆయన కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఇరికిపెంట పంచాయతీలో గంగిరెడ్డిపురం టీడీపీకి కంచుకోటగా ఉండేది. ఇటీవల ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన సందర్భంగా పలు కుటుంబాలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరాయి. మిగిలిన 15 కుటుంబాలు కూడా  పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన మాటలు నెరవేర్చ లేదని, పేదలకు ఒక్క మేలు కూడా ఒనకూరలేదని వారు పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలతో అందరికీ లబ్ధిచేరడం ఖాయమని, అందుకే వైయస్‌ఆర్‌ సీపీలో  చేరుతున్నామని తెలిపారు. వైయస్‌ఆర్‌సీపీలో చేరినవారిలో మాజీ ఉప సర్పంచ్‌ ఎరయ్య్ర, నాయకులు కదిరప్ప, వెంకట్రామయ్య, మునిరత్నం, శంకర, నరేష్, గంగాపతితో పాటు పలువురు ఉన్నారు. సింగిల్‌ విండో అధ్యక్షుడు డాక్టర్‌ వెంకటేశ్వరరావు, బ్యాంకు రమణ, గంటికోట రాజా, సూరిరెడ్డి, బగ్గిడి నాగరాజ, మణి, రెడ్డెప్ప, రవి, శంకర, రాధాకృష్ణ, రమేష్‌ పాల్గొన్నారు. 
 
Back to Top