టీడీపీ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం


దోచుకుని..దాచుకోనే పనిలో చంద్రబాబు అండ్‌ కో..
వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాస్‌

విజయనగరంః దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి సంక్షేమ పాలన కావాలంటూ ప్రజలు పెద్దఎత్తున ఆయన తనయుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాస్‌ అన్నారు.2014లో చంద్రబాబు మాటలు విని అన్నివర్గాల ప్రజలు తీవ్రంగా మోసపోయారన్నారు.  టీడీపీ పాలనలో ఉద్యోగులకుభద్రత, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, మహిళలకు రక్షణ లేదన్నారు. నాలుగున్నరేళ్లలో కాలయాపన చేసి కేవలం దోచుకునే పనిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు. వ్యవస్థను అవినీతిమయం చేశారన్నారు. టీడీపీ నేతలు నుంచి కార్యకర్తలు వరుకూ అక్రమాలు, అవినీతిలో మునిగి తేలుతున్నారన్నారు.కోట్లాది రూపాయల భూములను కబ్జా చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటుందన్నారు. నేడు గొర్లలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలకు వేలాది మంది ప్రజలు తరలివస్తున్నారన్నారు.టీడీపీ పాలనలో నిర్వీర్యమయిన వ్యవస్థను గాడిలోకి తీసుకురావాలంటే ఒక జననేత జగన్‌మోహన్‌ రెడ్డి వలనే సాధ్యమవుతుందన్నారు.
Back to Top