వైయస్‌ఆర్‌సీపీలోకి కాంగ్రెస్,టీడీపీ నేతల చేరికలు

విశాఖః ప్రజలు చంద్రబాబును ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని శ్రీకాకుళం జిల్లా వైయస్‌ఆర్‌సీపీ నేత దువ్వాడ శ్రీనివాస్‌ అన్నారు. చంద్రబాబు పాలనలో ప్రజలు విసిగి వేసారి చంద్రబాబును సాగనంపాలనే ఉద్దేశ్యంతో ఉన్నారన్నారు. గతంలో దివంగతం నేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన పథకాలన్నింటిని చంద్రబాబు సర్వనాశనం చేశారన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు జగన్‌సమక్షంలో  వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. వారికి జగన్‌ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చేరినవారిలో ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన ఒక ఎంపిటీసీ, ఇద్దరు సర్పంచ్‌లు ఉన్నారు.
Back to Top