ప్రత్యేకహోదాపై బీజేపీ,టీడీపీలు దొంగ నాటకాలు


వైయస్‌ఆర్‌సీపీ నేత కోరుముట్ల శ్రీనివాసులు

ఢిల్లీఃరాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేకహోదాతో పాటు, విభజన హామీలను కూడా నెరవేర్చకుండా బీజేపీ,టీడీపీ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని వైయస్‌ఆర్‌సీపీ నేత కోరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. రాష్ట్రంలో పెద్ద దొంగల నాయకుడుగా చంద్రబాబు పేరు ప్రత్యేకంగా చెప్పనవరంలేదన్నారు. చంద్రబాబు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. 40 సంవత్సరాల అనుభవం అని చెప్పకుంటున్న చంద్రబాబు రోజుకో మాట,పూటకో మాట మాట్లాడుతున్నారన్నారు. విభజనహామీలపై కేంద్రం దొంగనాటకాలు ఆడుతుందన్నారు. రాజ్యాంగాన్ని చంద్రబాబు ఖూనీ చేశారన్నారు.కనీసం ఎస్సీ,బీసీ కార్పొరేషన్‌ ద్వారా రాయితీలు కూడా ఇవ్వకుండా నిర్వీర్యం చేశారన్నారు.
Back to Top