నెల్లూరు: రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లోకి కనీసం మీడియాను కూడా అనుమతి ఇవ్వకుండా అత్యంత దారుణంగా రాష్ట్ర విభజన చేశారని ప్రముఖ న్యాయవాది రాంరెడ్డి అన్నారు. నెల్లూరు లో ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ నిర్వహించిన యువభేరిలో ఆయన ప్రసంగించారు. ఇంకా రాం రెడ్డి ఏమన్నారంటే..* పార్టీలు శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఒక్క పేజీని కూడా చదవలేదు* విద్యార్థులంతా ఏకమై ప్రత్యేక హోదాను సాధించుకోవాలి* జగన్ సారథ్యంలో మనమంతా ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడిపై ఉంది* ఇప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు చేసినన్ని విదేశీ పర్యటనలు ఎవరు చేయలేదు* పాకిస్తాన్ నుంచి పెట్టుబడులు వస్తాయంటే చంద్రబాబు అక్కడికి కూడా వెళ్తారు* పేద విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు వచ్చే పరిస్థితి లేదు