ఓటుకు కోట్లు ముద్దాయిలకు ఆంధ్రలో ఆశ్రయంసీమాంధ్రలో దోచి సింగపూర్లో దాస్తున్నారు..విజయవాడ ఇప్పుడే గుర్తుకొచ్చిందా?కేసు కోసం రాష్ర్ట ప్రయోజనాలు ‘కృష్ణా’ర్పణంటీడీపీ అంటే ఏమిటి? తెలుగుదేశం పార్టీ అని చిన్నపిల్లాడినడిగినా చెబుతాడు.. కానీ ఇపుడు టీడీపీ అంటే రాష్ర్టప్రజల దృష్టిలో టోటల్ అర్ధమే మారిపోయింది. టీడీపీని తోడు దొంగల పార్టీగా పిలుచుకుంటున్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగలకు ఆంధ్రప్రదేశ్లో ఆశ్రయమిచ్చిన తెలుగుదేశం పార్టీని అలా పిలవడం కరెక్టేనని జనం అంటున్నారు. ఈ కేసులో వీడియోటేపుల్లో దొరికిపోయిన తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి జైలు ఊచలు లెక్కబెడుతుండగా ఆడియోటేపుల్లో చిక్కుకున్న ఆ పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా తిరిగేస్తున్నారు. టూర్ల మీద టూర్లు చేసేస్తున్నారు. సమీక్షలన్నీ అక్కడే. సమావేశాలన్నీ అక్కడే. అధికారులపై అదిలింపులు, పోలీసులకు బెదిరింపులు షరా మామూలు. ఓటుకు కోట్లు కేసులో సాక్ష్యాలు బైటపడినప్పటి నుంచి చంద్రబాబు గారికి ఆంధ్రప్రదేశ్పై ప్రేమ అపారంగా పెరిగిపోయిందని అధికారులు జోకులేసుకుని నవ్వుకుంటున్నారు.నేరం చేసేది తెలంగాణలో. నేరం చేసినది హైదరాబాద్లో. కానీ ముద్దాయిలు దొరకకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎలా సహాయం చేస్తున్నారు? దాక్కునేందుకు ఆంధ్రప్రదేశ్ అడ్డానా? ఓటుకు కోట్లు కేసులో ముద్దాయిలుగా ఉన్న మత్తయ్య, సండ్ర వెంకట వీరయ్య ఆంధ్రప్రదేశ్లో తలదాచుకోవడం తెలిసిందే. ఇందులో ముత్తయ్య ఏకంగా కేసులు పెడుతుంటే ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం అన్ని పనులూ వదిలేసి వాటిని విచారించే పనిలో బిజీగా ఉంది. ఎక్కడైనా పొరుగురాష్ట్రంలో నేరం చేసిన నేరగాళ్లు మన రాష్ర్టంలోకి ప్రవేశిస్తే పట్టుకుని ఆ రాష్ర్ట పోలీసులకు అందించడం చూస్తుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇందుకు భిన్నం. పొరుగురాష్ట్రాలలో నేరాలు చేసిన వారికి అక్కడ రాచమర్యాదలు జరుగుతున్నాయి. నేరగాళ్లకు షెల్టర్జోన్గా అది మారిపోయింది. అందుకే టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాకుండా తోడు దొంగల పార్టీగా మారిందని దీన్ని బట్టి అర్ధం కావడం లేదూ?ఆ ముగ్గురూ జైల్లో ఉండాలి. కానీ ఏపీలో ఉన్నారు..ఓటు-కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జెరూసలెం మత్తయ్యకు హడావుడిగా విజయవాడలో నివాసం ఉన్నట్టు చంద్రబాబు తప్పుడు ఆధారాలు సృష్టించాడు. ఈ అంశంమీద దర్యాప్తు జరిగితే ఇందులో ఉన్న అధికారులకు, ఉద్యోగులకు కూడా ఈ రోజు కాకపోయినా రేపు అయినా జైలు తప్పదు. జెరూసలెం మత్తయ్యను విజయవాడలో దాస్తే.... ఈ కేసులో మరో నిందితుడు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను కొన్నాళ్ళు విశాఖపట్టణంలో, మరి కొన్ని రోజులు రాజమండ్రిలో దాచారు. బహుశా ఇప్పుడు కుప్పంలో చంద్రబాబుగారి పొలాల్లో లేక ఆయన బంధువుల ఇళ్ళలో దాచి ఉంటారు. ఇక ప్రధాన కపట నాటక సూత్రధారి అయిన చంద్రబాబు నాయుడు ఈ కేసులో కోర్టులో గానీ. సాక్ష్యాల పరంగా గానీ హైదరాబాద్లో ఎలాంటి కదలికలు ఉన్నా వచ్చి విజయవాడలో వాలిపోతున్నారు. సీమాంధ్ర ప్రజల మీద ప్రేమతో కాదు. కేసుల మీద భయంతో. ఆయనకు ప్రజల మీద ప్రేమే ఉంటే మొదటి సంతకంతోనే రుణాలు మాఫీ అయ్యేవి. మాఫీ కాకపోగా ఏపీ రైతును రుణగ్రస్తుల జాబితాలో దేశంలోనే నంబర్ 1 చేశాడు. ఒక్క రాజధాని భూములు, సింగపూర్ డీల్ ద్వారా రూ. 1 లక్ష కోట్లు దోచిన చంద్రబాబు నాయుడు ఏపీ రైతులకు ఏకంగా రూ. 1 లక్ష కోట్ల వ్యవసాయ రుణాలు మిగిల్చాడు. డ్వాక్రా రుణాలు మాఫీ కాక సగం సంఘాలు మూతపడ్డాయి. నిరుద్యోగ భృతికి ఇవ్వాల్సిన డబ్బంతా తన కుటుంబంలో ఉన్న నిరుద్యోగి లోకేశ్కు నెల నెలా కోట్ల రూపాయల దోపిడి సొమ్ము ద్వారా ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాడు. వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు నేల రాలినట్టుగా ఇప్పుడు చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి దొరికిపోయి... ఇక్కడ మన రాష్ట్రంలో దాక్కునేందుకు గుడారాన్ని రెడీ చేసుకుంటున్నాడు. సొమ్ము దోచేందుకు సీమాంధ్ర... సొమ్ము దాచేందుకు హైదరాబాద్, సింగపూర్చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏడాదిగా చేస్తున్నది పరిపాలన కాదు. దోపిడీ, పక్కాగా అవినీతి. గ్రామగ్రామానా ఇసుక దోపిడీ. గనులున్న ప్రతి చోటా బెదిరించి గ్రానైట్, బెరైటీస్ దోపిడీ. అడవుల్లో కలప. ఎర్ర చందనం దోపిడీ. గ్రామాల్లో, పట్టణాల్లో భూ ఆక్రమణలు. జీవో నంబర్ 22 ద్వారా దోపిడీ. పారిశ్రామిక వేత్తలు అడగకుండానే 2070 కోట్ల రూపాయల దోపిడీ. గ్యాస్ బేస్డ్ విద్యుత్తు కేంద్రాలకు రాయితీల పేరిట ఏకంగా రూ.2500 కోట్ల దోపిడీ- అదీ రెండేళ్ళ లోనే. పట్టిసీమ ద్వారా ఏకంగా 600 కోట్ల రూపాయల కమిషన్. రాజధాని పేరిట 10,000 ఎకరాల అభివృద్ధి చేసిన భూమి సింగపూర్ సంస్థకు. ఎకరం రూ.10 కోట్లు వేసుకుంటే అదే ఏకంగా రూ.1 లక్ష కోట్ల దోపిడీ. ఇలా దోచిన సొమ్మంతా చంద్రబాబు ఎక్కడ దాస్తున్నారయ్యా అంటే సమాధానం సింగపూర్లో లోకేశ్ పేరిట కొంత. హైదరాబాద్లో ఎమ్మెల్సీలను కొనేందుకు కొంత. తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా మార్చటానికి మరో రెండు రాష్ట్రాల్లో ఖర్చు చేయటానికి కొంత. దోచిన సొమ్మును ఇలా వాడుతున్నారన్నమాట. అంటే సీమాంధ్రను దోచుకుంటున్నాడు. సింగపూర్లో దాచుకుంటున్నాడు. పక్క రాష్ట్రాలకు వందల కోట్లు తరలిస్తున్నాడు. ఇదంతా ఏపీని తాకట్టు పెట్టి చేస్తున్న దుర్మార్గం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1757-1857 మధ్యగానీ, బ్రిటిష్ ప్రభుత్వం 1857-1947 మధ్యగానీ ఇండియాను దోచిన దానికంటే, చంద్రబాబు ఈ ఏడాదిలో ఏపీ నుంచి దోచుకున్నదే ఎక్కువ. దొరక్క ముందు మహానాడు హైదరాబాద్లో...దొరికిన తరవాత విసృ్తతస్థాయి సమావేశం విజయవాడలో...ఆహా ఏమి డ్రామా? ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు... తనకంటే తన అల్లుడు మహానటుడని!రేవంత్రెడ్డి రికార్డింగు బయటకు రాకముందు తెలుగుదేశం పార్టీ మహానాడును... తాను సీఎంగా ఉన్న ఏపీలో నిర్వహించలేదు... హైదరాబాద్లోనే నిర్వహించారు. ఇప్పుడు సెక్షన్ 8 అంటూ అరుస్తున్న పెద్దమనిషి, హైదరాబాద్లో సీఎం కార్యాలయాల కోసం ఏకంగా రూ.50 కోట్లకు పైగా వెచ్చించాడు. తెలంగాణ తన వల్లే వచ్చిందని మహబూబ్నగర్, కరీంనగర్ వెళ్ళి సభల్లో చెప్పి వచ్చాడు. తెలంగాణలో తన పార్టీకి నష్టం కలగకుండా, పోలవరం ప్రాజెక్టును తెలంగాణ వాదులు కోరుకున్న విధంగా నిలుపు చేసి, తెలంగాణ వాదుల డిమాండ్కు అనుగుణంగా అక్కడ ఒక లిఫ్ట్ను మాత్రమే ఏర్పాటు చేసి పట్టిసీమ మొదలుపెట్టి, అందులోనూ వందల కోట్లు కొట్టాడు. తెలంగాణలో 2019లో అధికారంలోకి రావటమే తన ధ్యేయం అని ఒకటి కాదు... వంద సార్లు ప్రకటించాడు. ‘ఓటుకు కోట్లు’తో ఏపీ ప్రయోజనాలు కృష్ణార్పణంరేవంత్రెడ్డి (మే 31న) పట్టుబడటంతోపాటు, చంద్రబాబు వాయిస్ టేపులు (జూన్ 7న) బయటకు రావటంతో చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర సమితి వారి కాళ్ళు పట్టుకునే కార్యక్రమానికి అటు ఢిల్లీలో సీఎం రమేశ్ ద్వారా, ఇటు హైదరాబాద్లో తన పార్టీ నేతల ద్వారా సాగించాడు. అదే సమయంలో కృష్ణా జలాల అధారిటీ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తన 299 టీఎంసీల నీటికి ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చు అని అంగీకరించటం ద్వారా ఏకకాలంలో అటు రాయలసీమ ప్రాజెక్టులకు, ఇటు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా డెల్టాకు నీరు రాకుండా యథేచ్ఛగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించేందుకు సహకరించాడు. తద్వారా మరోసారి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కృష్ణా డెల్టాకు చావు దెబ్బ తగిలే పరిస్థితి వచ్చింది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, ఆయన చేతగాని నిర్వాకం వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాల మీద మిగులు హక్కుల్ని పూర్తిగా కోల్పోయింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే కర్ణాటక, మహారాష్ట్రలు ఏపీకి నీరు రాకుండా ఆలమట్టి, నారాయణపూర్ వంటి భారీ ప్రాజెక్టులతో పాటుగా వందల కొద్దీ చిన్న ఆనకట్టలు నిర్మించాయి. ఆ రోజుల్లో కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబు రాష్ట్రానికి పై రాష్ట్రాలు చేసిన అన్యాయాన్ని అడ్డుకోకపోవటం ద్వారా కృష్ణా రైతుకు తీరని ద్రోహం చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే తంతు! తెలంగాణ ప్రభుత్వం ముందు తన కేసు కోసం మోకరిల్లి బోర్డులో అన్యాయం చేశారు. ఇలాంటి సీఎం తెలుగుజాతి దౌర్భాగ్యం. ఓటుకు కోట్లు కేసులో సాక్ష్యాలు బయటకు వచ్చి నెల రోజులు అయినా ఆయన్ను సీఎంగా చూడాల్సి రావటం ఏపీ ప్రజల దౌర్భాగ్యం.