'స్థానిక' రిజర్వేషన్‌పై సర్కార్‌ అధ్యయనం

హైదరాబాద్‌, 5 సెప్టెంబర్‌ 2012 : స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌ కోటాపై హైకోర్టు తీర్పును పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధ్యయనం చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఈ విషయమై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, బీసీ మంత్రులతో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి త్వరలోనే సమావేశం కానున్నారని సమాచారం. రిజర్వేషన్లపై బీసీ సంఘాలు, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వ నిర్ణయించింది.

Back to Top