వైయస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని తెలుగురాష్ట్రాల్లో ప్రత్యేక పూజలు..

నల్లబ్యాడ్జిలతో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణుల నిరసన..
వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నాని నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో  నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.జననేత జగన్‌మోహన్‌ రెడ్డి త్వరగా కోలుకోవాలని  పలు దేవాలయాల్లో వైయస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్లబాడ్జీలు పెట్టుకుని బైక్‌ ర్యాలీలు నిర్వహించారు.  విజయనగరం గడియార స్తంభం సెంటర్‌లో వైయస్‌ఆర్‌సీపీ నేతలు నల్లబాడ్జీలతో నిరసన తెలిపారు.పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వైయస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆళ్ల నాని ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు జరిపారు. విజయవాడలో  వైయస్‌ జగన్‌పై హత్యాయత్నానికి నిరసనగా పడమటలో పార్టీనేతలు ఏంవీఆర్‌ చౌదరి, తోట శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. హెదరాబాద్‌లో వైయస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని  వైయస్‌ఆర్‌సీపీ నేత కొండా రాఘవరెడ్డి పెద్దమ్మగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురంలో వైయస్‌ జగన్‌పై దాడిని ఖండిస్తూ గుంతకల్లులో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. దుకాణాలు మూసివేత వేశారు.  ఈ కార్యక్రమంలో వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. గుత్తి ఆర్‌ఎస్,పామిడి పట్టణాల్లో బంద్‌ నిర్వహించారు. వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు.చిత్తూరు జిల్లాలో  వైయస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని బి.కొత్తపేటలో ఎంపీపీ ఖలీల్‌ ఆధ్వర్యంలో దేవాలయాల్లో ప్రత్యేకపూజలు నిర్వహించి సర్వమత ప్రార్థనలు జరిపారు. నెల్లూరులో  వైయస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని కోరుతూ వెంకటగిరిలో శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో  వైయస్‌ఆర్‌సీపీ నేతలు చిట్టెటి హరికృష్ణ,నక్కా వెంకటేశ్వరరావు, మెరువ సురేంద్రలు 101 టెంకాయలు కొట్టి ప్రత్యేకపూజలు నిర్వహించారు. పొదలకురులో ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు, జెండాలతో ర్యాలీ నిర్వహించారు. నాయుడుపేటలో ఎమ్మెల్యే  కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. విశాఖపట్నం మాధవధర అభయ ఆంజనేయస్వామి ఆలయంలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు కేకే రాజు, ఈశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top