గడువులోపు ప్రకటన చేయకపోతే దీక్ష తప్పదు...!

విశాఖపట్నంః ఈనెల 25లోగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకహోదాపై ప్రకటన చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈనెల 26 నుంచి వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష తప్పదని ప్రభుత్వాలను హెచ్చరించారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు ప్రత్యేకహోదాను పట్టించుకోవడం లేదని విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో సుబ్బారెడ్డి ఆరోపించారు.

ప్రత్యేకహోదా విషయాన్నినీతి ఆయోగ్ కు అప్పగించామన్న కేంద్రం, నెలరోజులైనా స్పష్టత ఇవ్వలేదన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించడంతోనే తమ ప్రస్థానం మొదలవుతుందన్నారు.
Back to Top