తిరుపతిలో నేడు జగన్ 'వైయస్ఆర్ జనభేరి'

హైదరాబాద్:

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ‘వైయస్ఆర్ జనభేరి’ మోగిస్తున్నారు. తిరుపతి నుంచి ఈ సాయంత్ర 5 గంటలకు ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. అలాగే గుంటూరు, నల్లగొండ జిల్లాల్లో ఓదార్పుయాత్ర కూడా నిర్వహించనున్నారు. శ్రీ వైయస్‌ జగన్‌ శనివారం నుంచి పూరించనున్న జనభేరి, ఓదార్పుయాత్ర కార్యక్రమాల వివరాలను పార్టీ కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురాం శుక్రవారం ఒక ప్రకటనలో ‌తెలిపారు.
 మార్చి 1, 2014: శ్రీ జగన్మోహన్ ఉదయం హైదరాబా‌ద్ నుంచి బయలుదేరి తిరుపతిలో సాయంత్రం ‌5 గంటలకు జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. రాత్రికి ఆయన తిరుమలలో బసచేస్తారు.

మార్చి 2,2014: తిరుమల నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.
మార్చి 3, 2014: హైదరాబా‌ద్ నుంచి ఉదయం బయలుదేరి విజయవాడ చేరుకుంటారు. సా. 4‌ గంటలకు ఏలూరులో జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు.
మార్చి 4, 2014: సా.4 గంటలకు నిడదవోలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
మార్చి 5, 2014: సా.4 గంటలకు ఖమ్మం బహిరంగ సభలో శ్రీ జగన్ ప్రసంగిస్తారు.
మార్చి 6, 2014: సాయంత్రం 4 గంటలకు గుంటూరు జిల్లా నరసరావుపేట బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
మార్చి 7, 8, 2014: గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తారు.
 మార్చి 9 నుంచి నల్లగొండ జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తా‌రని తలశిల రఘురాం తన ప్రకటనలో వెల్లడించారు.

తాజా ఫోటోలు

Back to Top