బాబా సాహెబ్‌ అంబేద్కర్‌కు జగన్ నివాళి

హైదరాబాద్ :‌

భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్క‌ర్ 57వ వర్ధంతి వర్ధంతి‌ని పురస్కరించుకుని లోటస్‌పాండ్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి వైయస్ఆర్ కాంగ్రెస్ ‌పార్టీ అధినేత‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ‌దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బి.గుర్నాథరెడ్డి, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్, బీసీ విభాగం కన్వీన‌ర్ గట్టు రామచంద్రరావు, హైదరాబా‌ద్ జిల్లా ఎస్సీ కన్వీన‌ర్ రవికుమార్, ‌నాయకులు డా.ప్రఫుల్లారెడ్డి, నీలంరాజు తదితరులు పాల్గొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. పార్టీ ‌నాయకులు పీఎన్వీ ప్రసాద్, తమ్మినేని సీతారాం, చల్లా మధుసూదన్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top