కడప, సెప్టెంబర్ 25: అధికారంలోకి రావడం కోసం అబద్దాలు చెప్పి.. అడ్డమైన గడ్డి తిని అందరినీ మోసం చేసిన చంద్రబాబు, మరో ఐదేళ్లు ఎలాగూ ఎన్నికలు లేవు.. ప్రజలతో ఏమీపని ఉండదని మాట మార్చిఇష్టానుసారం బోగస్‌ల పేరుతో బూటకపు ఏరివేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతోపాటు అక్కాచెల్లెమ్మలు దయనీయమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని.. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వంద్వ నీతికి అద్దం పడుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.
ఆయన గురువారం సాయంత్రం వేముల మండలం వేల్పుల గ్రామం వద్ద డ్వాక్రా మహిళలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారినుద్దేశించి మాట్లాడుతూ... మహిళలకు అన్ని చేస్తామని చెప్పిన బాబు ఇప్పుడేమీ చేయకుండా మోసం చేసే కార్యక్రమాన్ని ముందుగా అమలు చేస్తూ డ్వాక్రా మహిళలతో చెలగాటమాడటం దారుణమన్నారు. బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వక, పాత రుణాలు వడ్డీ సహా కట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

పైగా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారని అక్కా చెల్లెమ్మలు ఆశతో ఎదురుచూస్తుంటే.. టీడీపీ ప్రభుత్వం మాత్రం వారి రుణాలకు అపరాధ రుసుం కింద వడ్డీకి వడ్డీ వేసి దారుణంగా వసూలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. అంతేకాకుండా ఒకేసారి కంతుల రూపంలో అసలుకు కడుతున్న సొమ్మును కూడా వడ్డీలోకి జమ చేసుకుంటుండటం విచారకరమన్నారు. వైఎస్‌ఆర్ హయాంలో పావలా వడ్డీకే రుణాలు అందిస్తే.. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వడ్డీలేని రుణం అన్నారు.. ఇప్పుడేమో అసలుకు కొసరు పేరుతో వడ్డీలకు వడ్డీలు రాబడుతూ నడ్డి విరుస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవ్వా తాతలకు మూడు పూటలా భోజనం పెట్టే ఆలోచన చేయకుండా కమిటీల పేరుతో వారి పింఛన్లను తొలగించి వారి పొట్టకొట్టే ఆలోచన చేయడం దుర్మార్గమైన చర్య. బోగస్ పింఛన్లను తొలగించడానికంటూ ఏర్పాటు చేస్తున్న కమిటీల్లో సామాజిక కార్యకర్తల పేరుతో టీడీపీ కార్యకర్తలను వేసుకొని మరీ ఏరివేతకు శ్రీకారం చుట్టడం దారుణం.

రాష్ట్రంలో 43,11,688మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా, గత కాంగ్రెస్ సర్కారు రూ.200ల చొప్పున పింఛన్ అందించేది. ఈ ప్రకారం నెలకు రూ.130 కోట్లు పంపిణీ చేసేది. అయితే బాబు అక్టోబరు నుంచి రూ.1000లకు పెంచి 43,11,688మందికి ఇస్తే నెలకు రూ.430 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలా నెలకు రూ.430 కోట్ల చొప్పున రానున్న ఏడు నెలలపాటు ఇవ్వడానికి రూ.3వేల కోట్లు అవసరమవుతాయి. గడిచిన ఐదు నెలలకు రూ.200ల చొప్పున ఇవ్వాల్సిన రూ.7,000 కోట్లు కలుపుకుంటే మొత్తం రూ.3,700కోట్లు బడ్జెట్‌లో కేటాయించాలి.

కానీ చంద్రబాబు సర్కారు పింఛన్ల ఏరివేతకు శ్రీకారం చుట్టాలని ముందుగానే నిర్ణయించుకొని అందుకు అనుగుణంగానే బడ్జెట్‌లో కేవలం రూ.1338కోట్లు మాత్రమే కేటాయించింది. ఆ మేరకు ఇప్పుడు కత్తిరింపుల కార్యక్రమంతో ముందుకు పోతున్నారు. గ్రామాల్లో ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకొని నిర్ధారించుకున్న తర్వాత పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా బయోమెట్రిక్ విధానంతో ఎలాంటి లోటుపాట్లకు తావులేదు. అలా పక్కాగా ఉన్న పింఛన్లను బోగస్ పేరుతో చంద్రబాబు ఎలా తొలగిస్తారు?

బోగస్ పేరుతో రాష్ట్రంలో 17 లక్షల రేషన్ కార్డులను తొలగించడం అన్యాయం. ఒక్కొక్క ఇంటిలో దాదాపు నలుగురు చొప్పున వేసుకున్నా దాదాపు 67 లక్షల మంది పేద ప్రజలకు తిండి లేకుండా చేసేందుకు చంద్రబాబు కంకణం కట్టుకోవడం దుర్మార్గమైన చర్య. రేషన్ కార్డులను కత్తిరించడానికి కూడా బాబు ముందుగానే సిద్దమయ్యారు. అందుకే బడ్జెట్ లో తక్కువ మొత్తం కేటాయించారు.

గతంలోను బాబు హయాంలో రేషన్ కార్డులకోసం ప్రజలు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. బీపీఎల్ అంటే నెలకు రూ. 2వేలు ఆదాయం. ఆ మేరకు ఏడాదికి రూ. 24వేలు వస్తే పేదలు కాదని తేల్చి వారికి రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఏడాదికి రూ. 60 వేలలోపు ఆదాయం ఉన్న వారందరినీ నిరుపేదలుగా గుర్తించి, ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చిన ఘనత వైఎస్ దే. చంద్రబాబు పాలన అంతా మోసాలతోనే సాగుతోంది. ఫీజు రీయింబర్సుమెంట్, రేషన్ కార్డులు, ఫించన్లను బోగస్ పేరుతో తొలగించటమే లక్ష్యంగా ముందుకు పోతున్నారు. రుణమాఫీ పేరుతో ప్రజల్ని మోసం చేశారు. రాబోయే రోజుల్లో దేవుడు మొట్టిక్కాయ వేసి గట్టిగా బుద్ది చెబుతాడని ఆశిద్దాం.

అక్టోబర్ 16న మండల కేంద్రాల్లో ధర్నాలు

అందరం కలిసికట్టుగా పోరాడుదాం. కష్టాలు ఉంటాయి.. నష్టాలు ఉంటాయి.. అన్నీ కొట్టుకుపోయే రోజులు కూడా దగ్గరలోనే ఉంటాయి. ప్రభుత్వ మోసాలకు వ్యతిరేకంగా అక్టోబరు 16న జరిగే మండల కేంద్రాల వద్ద జరిగే ధర్నాలలో పెద్ద ఎత్తున మహిళలు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలి. డ్వాక్రా మహిళలు, రైతు రుణమాఫీ పై బాబు ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రతి ఒక్కరు దండెత్తి ధర్నాలకు తరలి రావాలి.

కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పార్టీ రాష్త్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వేముల మండల పరిశీలకులు రాము, ఎంపీపీ ఉషారాణి, సర్పంచ్ పార్వతమ్మ, మాజీ జడ్పీటీసీ రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.