నటి అంజలీదేవి మృతికి జగన్‌ సంతాపం

హైదరాబాద్, 13 జనవరి 2013:

సుప్రసిద్ధ నటి అంజలీదేవి మృతి పట్ల వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కథా నాయకిగా తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసిన ఆమె వివిధ పాత్రల ద్వారా కోట్లాది మంది ప్రజల ప్రశంసలు, అభిమానాన్ని సంపాదించుకున్నారని శ్రీ జగన్‌ ప్రస్తావించారు.

ఆరు దశాబ్దాలలో 500 చిత్రాలకు పైగా నటించి చిత్రసీమలో తనకంటూ ఒక విశిష్టమైన స్థానాన్ని అంజలీదేవి సంపాదించుకున్నారని శ్రీ జగన్మోహన్‌రెడ్డి కొనియాడారు. చలనచిత్ర నటిగానే కాక, రంగస్థల నటిగా కూడా ఆమె విశేష గుర్తింపు పొందారని పేర్కొన్నారు. అంజలీదేవి మరణంతో తెలుగు చిత్ర రంగం తొలి తరానికి చెందిన ఒక ఆణిముత్యాన్ని కోల్పోయినట్లయిందని శ్రీ జగన్‌ తెలిపారు. సీతమ్మగా అంజలీదేవి ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. ఈ సందర్భంగా అంజలీదేవి కుటుంబ సభ్యులకు శ్రీ జగన్మోహన్‌రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top