తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి

వైయ‌స్ఆర్ జిల్లా:  చిన్నమండెం మండల పరిధిలోని కలిబండ గ్రామంలో తాగునీటి స‌మ‌స్య‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తామ‌ని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డిల దృష్టికి స్థానికులు వారు ఎదుర్కుంటున్న తాగునీటి సమస్యలను తీసుకొచ్చారు. తమ గ్రామానికి అలాగే కలిబండ కస్పాలో నూతనంగా నిర్మిస్తున్న ఆలయం వద్ద కూడా ఒక బోరు వేయించాలని జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ దేవనాథరెడి, పలువురు నాయకులతో కలిసి స్థానికులు ఎంపీ, ఎమ్మెల్యేలను  కోరారు. అందుకు స్పందించిన వారు త్వరలోనే తాగునీటి సమస్యల పరిష్కారం కోసం నూతనంగా బోర్లు వేయించే కార్యక్రమాలు చేపడతామని, ఇప్పటికే ఎంపీ నిధులతో పలు గ్రామాల్లో తాగునీటి కోసం బోర్లు వేయించడం జరిగిందని పేర్కొన్నారు. అంతకు ముందు కలిబండకు చేరుకున్న నాయకులకు ఘనస్వాగతం లభించింది. మొదటగా పాలేటమ్మ ఆలయంలో నాయకులు పూజలు చేశారు. అనంతరం గ్రామంలో పర్యటించారు. నాగూరి హరినాథరెడ్డి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు రాంమూర్తిస్వామి, జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ దేవనాథరెడ్డి, జడ్పీటీసీ కుటుంబ సభ్యులు కంచంరెడ్డి, సహకారపరపతి సంఘం అధ్యక్షులు గోవర్థన్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షులు ముసల్‌రెడ్డి, సర్పంచ్‌ నాగూరి వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎజాజ్, మాజీ సర్పంచ్ సలీం  , కోఆప్షన్‌ సభ్యులు గౌస్‌సాహెబ్, నాయకులు లోకేశ్‌రెడ్డి, అక్రమ్, గురివిరెడ్డి, వెంకట్రామిరెడ్డి , అంజి తదితరులు పాల్గొన్నారు. 

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే 
       చిన్నమండెం మండల పరిధిలోని వండాడిలో వైయస్సార్‌సీపీ నాయకులు ధనుంజయ్‌రెడ్డి తల్లి వెంకటసుబ్బమ్మ అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ దేవనాథరెడ్డి, కంచంరెడ్డి, ముసల్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, బాబురెడ్డి,రాజారెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.  
Back to Top