నిజామాబాద్ విస్తృత సదస్సుకు విజయమ్మ

నిజామాబాద్, 2 జూలై 2013:

నిజామాబాద్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగే పార్టీ విస్తృత స్థాయి సదస్సుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ హాజరవుతారు. ‌త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఈ సదస్సులో ఆమె దిశా నిర్దేశం చేస్తారు. నిజామాబాద్‌లోని లక్ష్మీ కల్యాణ మండపంలో జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సర్వసన్నద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా విజయమ్మ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విస్తృత స్థాయి సదస్సులు నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని శ్రీమతి విజయమ్మ ఈ సదస్సుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచిస్తున్నారు.

ఈ సదస్సుకు పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, కేకే మహేందర్‌రెడ్డి, కేశ్‌పల్లి గంగారెడ్డి, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు శనిగరం సంతోష్‌రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిశీలకురాలు పి. విజయారెడ్డి, నిజామాబాద్, జహీరాబా‌ద్ పార్లమెం‌టరీ స్థానాల పరిశీలకులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఉజ్వల్‌రెడ్డి, నియోజకవర్గాల సమన్వయకర్తలు అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.సిద్ధార్థరెడ్డి, కెప్టెన్ కరుణాక‌ర్‌రెడ్డి, నాయుడు ప్రకాశ్, గంపసిద్ధ లక్ష్మి‌, అనుబంధ సంఘాల ప్రతినిధులు కంఠం ధర్మరాజు, సులోచన, విజయలక్ష్మి, సయ్యద్‌ ముక్తార్‌ పాషా తదితరులు పాల్గ్గొంటారు. ఈ విసృత స్థాయి సదస్సుకు పార్టీ నిజామాబాద్ జిల్లా కన్వీన‌ర్ డా‌క్టర్ మధుశేఖ‌ర్ అధ్యక్షత వహిస్తారు.

Back to Top