ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన విజయమ్మ

హైదరాబాద్ 23 సెప్టెంబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిలు వచ్చిన ఈరోజే పండుగ రోజని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు, శ్రీ జగన్మోహన్ రెడ్డి  మాతృమూర్తి అయిన శ్రీమతి వైయస్  విజయమ్మ ఆనందాన్ని వ్యక్తంచేశారు.  శ్రీ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ నివాసంలో సోమవారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడారు. తమకు అండగా నిలిచిన ప్రజలందరికీ శ్రీమతి విజయమ్మ కృతజ్ఞతలు తెలిపారు. అందరి ఆశీర్వాదాలు శ్రీ జగన్మోహన్ రెడ్డికి కావాలని కోరారు. దేవుడు గొప్ప దేవుడని, 16 నెలల నుంచి జైలులో ఉన్న శ్రీ జగన్మోహన్ రెడ్డికి బెయిలొచ్చిందనీ ఆమె చెప్పారు.  దేశవిదేశాలలోని ఆయనకోసం ప్రజలంతా చేసిన  ప్రార్థనలు ఫలించాయన్నారు. జగన్ బాబు బెయిల్పై బయటకు వస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.   రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన నిలబడి పోరాడినట్లు చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top