ముగిసిన 205వ రోజు మరో ప్రజాప్రస్థానం

వెన్ను (విజయనగరం జిల్లా),

10 జూలై 2013: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేపట్టిన పాదయాత్ర 205వ రోజు బుధవారం షెడ్యూల్‌ విజయనగరం జిల్లా వెన్ను వద్ద ముగిసింది. బుధవారం ఉదయం లొట్టలపల్లి వద్ద పాదయాత్ర ప్రారంభించిన శ్రీమతి షర్మిల 14 కిలోమీటర్లు నడిచారు. 205వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ ముగిసే సమయానికి శ్రీమతి షర్మిల మొత్తం 2,732.4 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తిచేశారు.

వర్షంలోనూ పాదయాత్ర కొనసాగించిన షర్మిల :
కాగా శ్రీమతి షర్మిల పాదయాత్ర విజయనగరం జిల్లాలో అప్రతిహతంగా కొనసాగుతోంది. శ్రీమతి షర్మిల పాదయాత్ర సోమరాజుపాలెం చేరుకునేసరికి భారీగా వర్షం కురిసింది. భారీ వర్షం పడుతున్నా ఆమె తన పాదయాత్రను యధావిధిగా కొనసాగించారు.

Back to Top