'సిఎం కిరణ్‌ అవినీతి ఎంతో వారే చెప్పాలి'

రాయచోటి : మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి అండదండలతో పదవులు పొంది, ఆయన కుటుంబం తప్పితే రాష్ట్రానికి మరో దిక్కులేదని చెప్పిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోదరులు ఇప్పుడు అదే కుటుంబంపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాయచోటిలోని తన కార్యాలయంలో గడికోట శనివారంనాడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐదేళ్లు కష్టపడి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన వైయస్‌ఆర్ ఒక దినపత్రిక, చాన‌ల్‌ను ఏర్పాటు చేయడం అవినీతి అయితే, కేవలం రెండేళ్లలోనే రెండు టి.వి. చానళ్లు, ఒక పత్రికను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమా‌ర్‌రెడ్డి ఇంకెంత అవినీతికి పాల్పడ్డారో వెల్లడించాల్సిన బాధ్యత అధికార, ప్రతిపక్ష నాయకులపై ఉందని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.
Back to Top