సత్రం భూముల్లో వేయి కోట్ల కుంభకోణంబాబు నైజం మరోసారి బయటపడిందిబాబుకు కోర్టులన్నా, చట్టాలన్నా లెక్కే లేదువైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేణుగోపాల కృష్ణ
హైదరాబాద్: సదావర్తి సత్రం భూముల కుంభకోణం ద్వారా చంద్రబాబు నైజం మరోసారి బహిర్గతమైందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వేణుగోపాలకృష్ణ అన్నారు. తిరిగి వేలం వేయడంలోనూ, రూ.5 కోట్లు అదనంగా ఇస్తే భూములు ఇచ్చేస్తానని అనడంలోనూ, వచ్చిన సంస్థలను బెదిరించిన బాబు నైజమంతా ప్రజలకు అర్థమైపోయిందన్నారు. సత్రం భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వేణుగోపాలకృష్ణ మాట్లాడారు.
మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే...
* వేద బ్రాహ్మణుల విద్య కోసం వాసిరెడ్డి వెంకటరత్నం నాయుడు సదావర్తి సత్రానికి భూములు దానం చేశారు.* టీడీపీ ఎమ్మెల్యే శ్రీధర్ లేఖపై ఆగమేఘాలపై సదావర్తి భూములను వేలం వేశారు* మద్రాసులో అతికీలకమైన వాణిజ్య సముదాయాలు ఉన్న చోట సదావర్తి సత్రం భూములున్నాయి. * దేవాదాయ శాఖ రూ. 6 కోట్లు అప్‌సెట్ ఫ్రైస్ నిర్ణయిస్తే... మార్కెట్ విలువ రూ. 12 -13 కోట్లు.* సదావర్తి భూముల్లో వేయి కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైయస్సార్సీపీ నిజనిర్థారణ కమిటీని నియమించింది.* సదావర్తి సత్రం భూములను నిజనిర్థారణ కమిటీ సందర్శించింది.* అధికార ప్రభుత్వం రూ. 27 లక్షలకే తన బినామీలకు భూములు కట్టబెట్టిన వాస్తవాలను నిజనిర్థారణ కమిటీ ప్రజలకు చూపించింది.* అప్పుడు చంద్రబాబు రూ. 5 కోట్లు అదనంగా ఇస్తే భూములిస్తామన్నారు. * సదావర్తి భూముల వ్యవహారం ప్రైవేట్ వ్యవహారం కాదు... రాష్ట్రం, దేశంలో చట్టాలున్నాయి..* దేవాదాయ శాఖ భూములను విక్రయించాలంటే హైకోర్టు అనుమతి తప్పనిసరి... కానీ బాబుకు కోర్టులన్నా, వాటి ఆదేశాలన్నా లెక్కలేదు. * లోకేష్‌కు బినామీగా ఉన్న చలమలశెట్టి రామాంజనేయ కుటుంబ సభ్యులకు భూములు అప్పగించిన దానిని ప్రజలు గమనిస్తున్నారు* ఈ భూముల్లో జరిగిన కుంభకోణాన్ని వెలికి తీసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్థారణ కమిటీ తో పాటు టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ, సీపీఐ, సీపీఎం అన్ని ప్రతిపక్ష పార్టీలు అవినీతి జరిగిందని చెప్పాయి.* రూ. 5 కోట్లు అదనంగా ఇస్తానన్న వారిని భయపెట్టే విధంగా చంద్రబాబు మాట్లాడడం దారుణం.* ఆ భూములకు కాగితాలు లేవని... పక్కరాష్ట్రం వారు ఆ భూములను స్వాధీనం చేసుకునే అవకాశం ఉందనడం సిగ్గుచేటు* పక్కరాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రితో మాట్లాడి సదావర్తి భూములను దేవాదాయ శాఖకు ఉపయోగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.* ఆలయాలకు సంబంధించిన భూములను కబ్జా చేసిన వారిపై ఏ ఒక్క రోజైనా క్రిమినల్ కేసులు పెట్టిన దాఖలాలు ఉన్నాయా బాబు.*చట్టాలను కూడా బేఖాతరు చేస్తూ బాబు భూదోపిడి చేస్తున్నారు.* రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్‌పూలింగ్ పేర తీసుకున్న భూములను స్విస్ ఛాలెంజ్ పద్ధతిన సింగపూర్‌కు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం.* దేశంలోనే అత్యున్నతమైన సుప్రీంకోర్టు స్విస్ ఛాలెంజ్ పద్ధతి సరైంది కాదని పేర్కొంది. * కేంద్ర ప్రభుత్వ సంస్థ సైతం స్విస్ ఛాలెంజ్ విధానం వద్దని వాదించింది. * దోపిడీ కోసమే బాబు స్విస్ ఛాలెంజ్ విధానం .* బందర్ పోర్ట్‌కు సంబంధించి 28 రెవెన్యూ గ్రామాల్లో సుమారుగా లక్ష 5 వేల ఎకరాలను భూ సమీకరణ ద్వారా పోర్ట్‌కు తీసుకునేందుకు కుట్ర చేస్తున్నారు. * రాష్ట్రానికి సమాచార శాఖ మంత్రిగా ఉన్న పల్లె రాఘునాథ రెడ్డి స్పష్టంగా బందర్ పోర్ట్‌కు లక్ష 5 వేల ఎకరాల భూ సేకరణ చేయబోతున్నామన్నారు. * మరుసటి రోజే అక్కడ ఆ జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర సమాచార శాఖ మంత్రిగారికి సమాచార లోపముంది... లక్ష 5వేల ఎకరాలు కాదు... 33 వేల ఎకరాలు మాత్రమే అని ప్రకటించారు.* ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని అందించాల్సిన సమాచార శాఖ మంత్రికే సమాచారం లేకపోతే ఎలా..?* ప్రజలను మభ్యపెట్టి వారి భూములను స్వాధీనం చేసుకోవాలని టీడీపీ కుయుక్తులు* దీనికి వ్యతిరేకంగా వైయస్సార్సీపీ పోరాడుతుంది... టీడీపీ అవినీతిని ఎండగడుతుంది... ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తుంది...* సదావర్తి భూములపై సీబీఐ విచారణ జరిపించాలని వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు.