- నారాయణ రెడ్డి హత్య కేసులో కేఈ నిందితుడు
- డిప్యూటీ సీఎంకు బాబు ఆశీస్సులున్నాయి
- పోలీసుల విచారణతో ఎలాంటి న్యాయం జరగదు
- రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికే తమ మద్దతు
- అత్యున్నత పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికైతేనే హుందాతనం
వైయస్ఆర్ జిల్లాః నారాయణరెడ్డి హత్య కేసులో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి నిందితుడని, ఆయనకు చంద్రబాబు ఆశీస్సులున్నాయని వైయస్ జగన్ అన్నారు. నారాయణరెడ్డి హత్య కేసుపై సీబీఐచే దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణతోనే న్యాయం జరుగుతుందని...పోలీసుల విచారణ వల్ల ఎవ్వరికీ మేలు జరగదని అన్నారు. వైయస్ఆర్ జిల్లా పులివెందుల పర్యటనలో ఉన్న వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే...
- చంద్రబాబు పరోక్షంగా సహకరించబట్టే డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి నియోజకవర్గం పత్తికొండలో హత్య జరిగింది.
- నారాయణరెడ్డి వెపన్ లైసెన్స్ రెన్యువల్ కోసం తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసినా పోలీసులు తిరిగి ఇవ్వలేదు
- పథకం ప్రకారం హత్య చేశారు. ఇసుకమాఫియాపై నారాయణరెడ్డి యుద్ధం చేసిన కారణంగా కేఈ కుమారుడిపై విచారణకు హైకోర్టు ఆదేశించింది
- ఇలాంటి నేపథ్యంలో భద్రత కోసం నారాయణరెడ్డి పదేపదే వేడుకున్నారు. కోర్టు ఆదేశాలతో సెక్యూరిటీ ఇస్తే మూడు నెలల్లో తొలగించారు.
- రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎదుటివారిని కూడ ప్రేమించడం నేర్చుకోవాలి
- నారాయణరెడ్డి మరణిస్తే పోటీ ఉండదనుకోవడం పొరపాటు. నారాయణ రెడ్డి సతీమణి అభ్యర్థిగా పోటీలో ఉండొచ్చు
- పత్తికొండలో 50వేల మెజారిటీతో గెలిచే పరిస్థితి వస్తుంది.
- నారాయణ రెడ్డి హత్య కేసులో డిప్యూటీ సీఎం నిందితుడు. ఆయనకు బాబు ఆశీస్సులు ఉన్నాయి.
- సీబీఐ విచారణ జరిపిస్తేనే న్యాయం జరుగుతుంది. పోలీసుల విచారణ వల్ల ఎవ్వరికీ మేలు జరగదు
- సీఎం పదవిలో ఇవాళ చంద్రబాబు ఉండొచ్చు... రేపు మేం గెలవొచ్చు
- ఎవరు అధికారంలో ఉన్నా ఐదు కోట్లమంది ప్రజల్లో దేవుడు ఒకరికే సీఎంగా ఉండే అవకాశం ఇస్తాడు
- అలాంటి పదవుల్లో ఉన్నవారెవరైనా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలి. ప్రజలకు మంచి చేయాలి
- ప్రజల ఆశీస్సులు, దీవెడి దీవెనలతో సీఎంగా ఎన్నిక కావాలి తప్ప ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం సరికాదు.
- ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా చూడడం అన్యాయం
- స్పీకర్, రాష్ట్రపతి పదవులకు పోటీ ఉండకూడదు
- అత్యున్నత పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికైతేనే హుందాతనం ఉంటుంది
- న్యూట్రల్ గా ఉండేవారే ఆ పదవుల్లో ఉండాలని ఆశిస్తాం
- కోడెలను స్పీకర్ గా పెట్టినప్పుడు కూడ మేం మద్దతిచ్చాం.
- ఇంతకుముందు ప్రణబ్ ముఖర్జీకి కూడ సపోర్ట్ చేశాం.
- బీజేపీ అభ్యర్థికి సపోర్టు ఉంటుందని స్పష్టంగా ఇంతకుముందు చెప్పాం. ఇప్పుడు చెబుతున్నాం
- ఇటువంటి పదవులు ఏకగ్రీవంగా జరిగితేనే ఆపదవులకున్న హోదా కాపాడినట్టు అవుతుంది.
- అన్ని పార్టీలు దానికి సపోర్ట్ చేసే పరిస్థితి వస్తే బాగుంటుంది.