షర్మిల యాత్రకు అపూర్వ స్పందన

మహబూబ్‌నగర్:

మహానేత షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు లక్షమందికిపైగా జనం హాజరయ్యారని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా పరిశీలకులు బండారు మోహన్‌రెడ్డి చెప్పారు. అలంపూర్ నియోజకవర్గం పుల్లూరు బహిరంగసభ సందర్భంగా నలుదిక్కులా 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయన్నారు. దివంగత మహానేత వైయస్‌ఆర్ అమలుచేసిన అభివృద్ధి, సం క్షేమ పథకాల లబ్ధిదారులు జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న నమ్మకం కలిగి స్వచ్ఛందంగా కదిలొచ్చారన్నారు. షర్మిలమ్మ సందేశం వినాలనే ఆత్రుతతో రైతులు, కూలీలు భారీసంఖ్యలో పరుగులు తీస్తూ వచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల అభిష్టానానికి తాము వ్యతిరేకం కాదని, తెలంగాణను బతికి సాధించుకోవాలని షర్మిలతోపాటు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పిలుపునివ్వడంతో తెలంగాణవాదులు సైతం జేజేలు పలికారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌పార్టీలో కుమ్మలాటలే సరిపోయాయని, కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ ఎప్పుడు ఊడుతుందో తెలియని అనిశ్చితి నెలకొందన్నారు.  జిల్లాలో గద్వాల, మక్తల్, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గాల్లోని గ్రామాల ద్వారా జిల్లా కేంద్రానికి చేరుకొని షర్మిల బహిరంగసభల్లో పాల్గొంటారని వెల్లడించారు.

Back to Top