షర్మిల పాదయాత్ర చరిత్రాత్మకం: కొండా సురేఖ

వరంగల్, 13 అక్టోబర్‌ 2012:

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల చేయనున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు,  మాజీ మంత్రి కొండా సురేఖ విశ్వాసం వ్యక్తం చేశారు. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల కుమ్మక్కు కుట్రలను బట్టబయలు చేస్తూ ప్రజా సమస్యలపై పోరాడేందుకే వైయస్ జగ‌న్మోహస్‌రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర చేపట్టారని సురేఖ అన్నారు. వైయస్ జగ‌న్ ‌ముఖ్యమంత్రి అయ్యేంతవరకు తమ పోరాటం ఆగదని సురేఖ పేర్కొన్నారు. చంద్రబాబు పాదయాత్ర కొంగజపం లాంటిదని ఆమె ఎద్దేవా చేశారు.

తాజా వీడియోలు

Back to Top