షర్మిల నేటి పాదయాత్ర 17.3 కిలోమీటర్లు

మహబూబ్‌నగర్, ‌5 డిసెంబర్‌ 2012: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న ‘మరో ప్రజాప్రస్థానం’ బుధవారంనాడు మొత్తం 17.3 కిలోమీటర్లు కొనసాగుతుంది. మంగళవారం రాత్రికి తాను బసచేసిన మహబూబ్‌నగర్‌లోని జెజె గార్డెన్సు నుంచి శ్రీమతి షర్మిల 49వ రోజు పాయాయాత్ర బుధవారం ఉదయం ప్రారంభం అవుతుందని పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురా‌మ్, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఎనుగొండ, హౌసింగ్ బోర్డు, అప్పనాపల్లి, నక్కలబండ తండా మీదుగా‌ శ్రీమతి షర్మిల జడ్చర్ల చేరుకుంటారని వారు తెలిపారు. అక్కడి నుంచి బస్టాండు, కౌరంపేట చౌరస్తా, అంబేద్కర్ విగ్రహం సెంట‌ర్, నేతాజీ చౌ‌క్‌కు శ్రీమతి షర్మిల చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడతారు. అనంతరం సిగ్నల్‌గడ్డ, ఇందిరాగాంధీ విగ్రహం సెంటర్‌కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన గుడారంలో శ్రీమతి షర్మిల రాత్రికి బసచేస్తారని రఘురామ్‌, కిష్టారెడ్డి తెలిపారు.
Back to Top