షర్మిల నేటి మరో ప్రజాప్రస్థానం షెడ్యూల్ ఇదీ..

నల్గొండ, 18 ఫిబ్రవరి 2013:‌ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం, స్వార్థం కోసం దానికి వత్తాసుగా నిలుస్తున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి తీరుకు నిరసనగా శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సోమవారం నల్గొండజిల్లా మిర్యాలగూడ, దామరచర్ల మండలాల్లో కొనసాగుతుంది. ప్రజల కష్టసుఖాల్లో తామున్నామంటూ భరోసా ఇస్తూ వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల ఈ సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారు.

సోమవారం ఉదయం మిర్యాలగూడ మండలంలోని ఈదులగూడెం నుంచి శ్రీమతి షర్మిల 70వ రోజు పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి గూడూరు, కృష్ణాపురం, కొత్తగూడెం మీదుగా దామరచర్ల మండలంలోని కొండ్రపోలు, కొండ్రపోలు కాల్వ, రాళ్లవాగు తండా, బొత్తలపాలెం చేరుకుంటుంది. బొత్తలపాలెం శివారులో ఏర్పాటు చేసిన గుడారంలో శ్రీమతి షర్మిల ఈ రాత్రికి బస చేస్తారు.
Back to Top