<strong>కర్నూలు, 9 నవంబర్ 2012:</strong> వైయస్ జగన్మోహన్‌రెడ్డి సంధించిన పాశుపతాస్త్రం షర్మిల మరో ప్రజాప్రస్థానం 24వ రోజు షెడ్యూల్‌ను పాదయాత్ర కన్వీనర్ తలశిల రఘురామ్ శుక్రవారం వెల్లడించారు. కర్నూలు జిల్లా తుగ్గలి నుంచి శనివారం ఉదయం షర్మిల పాదయాత్ర ప్రారంభమవుతుంది. అనంతరం రాతన, పత్తికొండ (టౌన్))) ))మీదుగా కొనసాగుతుందని ఒక ప్రకటనలో రఘురామ్ వివరించారు. అక్కడి నుంచి పాదయాత్ర వైయస్‌ఆర్ సర్కిల్ వద్ద షర్మిల బహిరంగ సభ ఉంటుందన్నారు. బహిరంగ సభ అనంతరం షర్మిల పాదయాత్ర గుత్తి రోడ్, పాతపేట, మెయిన్‌రోడ్, ఆదోని రోడ్ మీదుగా కొనసాగుతుంది. ఆదోనిలోని బిఇడి కళాశాల ఆవరణలో రాత్రికి షర్మిల బస చేస్తారని తలశిల రఘురామ్, పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పత్తికొండలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 24వ రోజున షర్మిల మొత్తం 13.2 కిలోమీటర్ల మేర నడుస్తారని ఆయన వివరించారు.