షర్మిలకు ఆరోగ్య సమస్యలు లేవు: వాసిరెడ్డి

గొల్లపల్లి:

వైయస్ షర్మిలకు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందీ లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చెప్పారు. శనివారం పదో రోజు ప్రారంభమైన మరో ప్రజాప్రస్థానం  మధ్యాహ్నానికి గొల్లపల్లికి చేరింది. జ్వరం కారణంగా వైద్యుల సూచన మేరకు నడిచే దూరాన్ని ఆమె ఆరు కిలోమీటర్లకు తగ్గించుకున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల ఆరోగ్య పరిస్థతిపై పద్మ మాట్లాడారు. ధర్మవరంలో సభకు హాజరైన జనసందోహంతో కరచాలనాలు, అభివాదాల నేపథ్యంలో షర్మిల విపరీతమైన వత్తడికి లోనయ్యారని ఆమె చెప్పారు. దీనివల్ల  ఆమె అలిసిపోయారని వివరించారు. కొద్దిగా మోకాళ్ళ నొప్పి ఉందనీ, చిన్నపాటి మందులు తీసుకోవడం మినహా ఎటువంటి ముందుజాగ్రత్తలు తీసుకోవడం లేదన్నారు. పెదవిపై చిరునవ్వు చెదరకుండా పాదయాత్ర సాగిస్తున్నారన్నారు. దైవంపై విశ్వాసమే షర్మిలను నడిపిస్తుందని పద్మ పేర్కొన్నారు.

Back to Top