<strong>శివరాంపల్లి (అనంతపురం జిల్లా): 25 అక్టోబర్ 2012:</strong> మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిర్వహిస్తున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేడు గురువారం 8వ రోజుకు చేరింది. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు, ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి గద్దె దించకుండా వంతపాడుతున్న ప్రధాన ప్రతిపక్షం టిడిని వైఖరికి నిరసనగా షర్మిల ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 3 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. 8వ రోజు గురువారం ఉదయం షర్మిల పాదయాత్ర అనంతపురం జిల్లాలోని శివంపల్లి నుంచి మొదలయింది. శివంపల్లి నుంచి ఆత్మకూరు, తిమ్మాపురంలలో పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నానికి అప్రాచెరువు సమీపానికి షర్మిల పాదయాత్ర చేరుకుంటుంది. అక్కడ మధ్యాహ్న భోజన విరామం తరువాత మరో ప్రజాప్రస్థానం యాత్ర సుబ్బారావుపేట క్రాస్ మీదుగా తుమ్మలక్రాస్‌కు చేరుతుంది. తుమ్మలక్రాస్‌లో షర్మిల రాత్రికి బస చేస్తారు.