నాలుగో రోజు వైెఎస్ షర్మిల పరామర్శ యాత్ర

వరంగల్) తెలంగాణ లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల నిర్వహిస్తున్న పరామర్శ యాత్ర నాలుగో రోజు దాటింది. జిల్లాలోని వరంగల్, హన్మకొండ, గీసుకొండ మండలాల్లో పర్యటించారు. 68 కిలోమీటర్ల దూరం గ్రామాల్లో పర్యటించారు. దివంగత మహా నేత వైెఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం గురించి తెలియగానే మనస్తాపంతో మరణించిన కుటుంబాల్ని ఆమె పరామర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వరంగల్ జిల్లా యాత్రలో నాలుగోరోజు ఏడు కుటుంబాల్ని పరామర్శించారు. స్థానికంగా ఉండే పిల్లలకు ఇంటి ఆడపడుచు మాదిరిగా షర్మిల .. రాఖీలు కట్టారు. ఈ యాత్రలో టీ వైెస్సార్సీపీ అగ్రనేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గట్టు శ్రీకాంత్ రెడ్డి, కొండా రాఘవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top