() చంద్రబాబు మోసాలు, అబద్దాల్ని ప్రశ్నిస్తే తప్పా..!() ఎమ్మెల్యేలను కొనేందుకు రూ. 600 కోట్లు ఎలా వచ్చాయి() తప్పుల్ని ప్రశ్నిస్తే తప్పవుతుందా() మోసాలు చేస్తున్న బాబుని చెప్పుతో కొట్టడం తప్పవుతుందా() అనంతపురం జిల్లా రైతు భరోసా యాత్రలో ప్రశ్నించిన వైయస్ జగన్ అనంతపురం)) విచ్చలవిడిగా అవినీతి చేస్తున్న చంద్రబాబు అక్రమాల్ని ప్రశ్నించటం తప్పెలా అవుతుందని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. మోసాలుచేస్తున్న చంద్రబాబుని చెప్పుతో కొట్టాలనటంలో తప్పేముందని ఆయన నిలదీశారు. రైతు భరోసా యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా యాడికి లో తనను కలిసేందుకు తరలి వచ్చిన ప్రజానీకాన్ని ఉద్దేశించి వైయస్ జగన్ ప్రసంగించారు. వైయస్ జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం.అందరికీ వెన్నుపోటు చనిపోయిన కుటుంబాలకు తోడుగా నిలిచేందుకు భరోసా యాత్ర చేసేందుకు ఇక్కడకు రావడం జరిగింది. రైతు, చేనేతలు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి ఎందుకు వచ్చిందని బాబు తన మనస్సాక్షిని అడగాల్సింది పోయి ఎగతాళి చేస్తున్నాడు. రైతులు, డ్వాక్రా మహిళలు ఆనందంగా ఉన్నారని అవహేళన చేస్తున్నారు. ఎన్నికలప్పుడు ఏం చెప్పారు. అయిపోయాక చేస్తున్నదేమిటి. ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మీది కాదా. టీవీ ఆన్ చేస్తే కనిపించేది, వినిపించేది ఒకటి. బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని వినిపించేది. రైతులు, మహిళలు, చేనేతల రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలని వినిపించేది. బాబు ముఖ్యమంత్రి అయ్యాక రైతులు, అక్కచెల్లెల్లు, చేనేతలు, చదువుకునే చిన్నపిల్లలను కూడా వెన్నుపోటు పొడుస్తున్నాడు. జాబు రావాలంటే బాబు రావాలని వినిపించేది. ఎన్నికలయ్యాక బాబుకు ముఖ్యమంత్రి జాబొచ్చింది. ఉన్న జాబులు ఊడబెరుకుతున్నాడు. జాబ్ లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని కరపత్రాలు పంచాడు.రెండేళ్లలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా..! కోటి 75 లక్షల ఇళ్లు ఎదురుచూస్తున్నాయి. ప్రతి ఒక్కరికీ వెన్నుపోటు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇటువంటి బాబు చేసిందేమైనా ఉందంటే విచ్చలవిడిగా అవినీతికి పాల్పడటం మాత్రమే. సిగ్గులేదా బాబు నీకు. అవినీతి రహిత రాష్ట్రం గురించి మాట్లాడతావా. చదువుకునే పిల్లలతో ప్రమాణం చేయిస్తావ్. అవినీతి సొమ్ముతో కొనుగోళ్లు ఇసుక నుంచి బొగ్గు దాకా అవినీతే. రాజధాని భూముల నుంచి గుడి భూములు అమ్మేదాకా అవినీతే. గుడిలో, గుడిలో లింగాన్ని కూడా మింగుతున్నాడు. విచ్చలవిడిగా ప్రజల గొంతు ఎక్కడా వినపడకూడదని ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న దురుద్దేశ్యంతో ఎమ్మెల్యేలను కొంటున్నాడు. 17 మందిని 30 కోట్ల చొప్పున అంటే 600కోట్లకు కొన్నాడు. ఎక్కడ నుంచి వచ్చింది ఇంత సొమ్ము. పట్టపగలు ఇలా చేస్తుంటే అడిగే పరిస్థితి లేదు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొంటూ ఆడియో వీడియోలతో దొరికిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చాయి ఆడబ్బు.శ్రీశైలంకు నీళ్లు రాకముందే పైనుంచి పైకి నీళ్లు తోడుకుపోతుంటే బాబు కేసీఆర్ ను ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగే పరిస్థితి లేదంటే దారుణం. అడిగితే ఓటుకు కోట్లు కేసులో జైలు పాలు చేస్తారని భయం. తన స్వార్థం కోసం ఐదుకోట్లమందిని రోడ్డున నిలబెట్టాడు. ప్రత్యేక హోదా అడగడం లేదు. హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి. ఎక్సైజ్ డ్యూటీలుండవు. రాయితీలు వస్తాయి. సింగపూర్, దుబాయి అవసరం లేదు. రాష్ట్రానికి వస్తారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలొస్తాయి. మంత్రులను ఉపసంహరించుకుంటామని అల్టిమేటం ఇవ్వడం లేదు. సీబీఐచేత ఎంక్వైరీ చేయించి జైల్లో పెడతాడని తాకట్టు పెట్టాడు. మోసం చేసిన బాబుని చెప్పులతో కొట్టడం తప్పా అని నేనడుగుతున్నా. అప్పుడు ఎన్నికలహామీలు గుర్తుకువస్తాయి. అప్పుడు మోడీ దగ్గర మంత్రులను ఉపసంహరించుకుంటాడు. లేదంటే లేదు మరి.అక్రమాల్ని ప్రశ్నించటం తప్పా..! బాబూ, నీవు తప్పు చేస్తున్నావని నిలదీస్తే అది తప్పట. ఎవరూ ప్రశ్నించకూడదట. బాబు మోసం చేసినా ఎవరూ అడగడకూడదట. వెన్నుపోటు పొడిచినా ఎవరూ అడగకూడదట. చేనేత కుటుంబాల దగ్గరకు వెళ్లా. 41 వేల రూపాయలు రుణాలు ఉన్నాయి. నిన్న తిట్టా. రాష్ట్రవ్యాప్తంగా 13 చేనేత కుటుంబాలు చనిపోయారు. యాడికి వచ్చినప్పుడు అక్కచెల్లెలు వారు పడుతున్న బాధలు ఇవి. వీళ్లకు సబ్సిడీ రావడం లేదు. రుణాలు మాఫీ కాలేదు. లక్ష రూపాయలు అదనపు రుణాలు అన్నారు. ఇళ్లు, షెడ్డు అన్నారు . చేసిన పాపాన పోలేదు. 87 వేల కోట్ల రైతులకు రుణాలుంటే అవి కట్టొద్దంటే కట్టని పాపానికి వడ్డీలే 25 వేల కోట్లు బ్యాంకులకు వడ్డీలు కడుతున్నారు. వడ్డీల్లో మూడోవంతు కూడా మాఫీ చేయలేదు. చంద్రబాబును ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యం బతకదు. బాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేసే రోజు దగ్గర్లోనే ఉంది. బాబులో మార్పు రావాలంటే మనమంతా ఒక్కటై ఒత్తిడి తేవాలి. మనపక్కనే తాడిపత్రి ఎమ్మెల్యేలను అడగండి. యాడికి కెనాల్ నీళ్లు రావటం లేదని నిలదీయాలి.ఈపోరాటం ఇంతటితో ఆగదు. కొనసాగించే కార్యక్రమంలో మీ దీవెనలు కావాలి. అని ఘాటుగా వైయస్ జగన్ నిలదీశారు.