షేర్‌మహ్మద్‌పేట నుంచి షర్మిల పాదయాత్ర

విజయవాడ, 22 ఏప్రిల్ 2013:

దివంగత మహానేత తనయ శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం సోమవారం ఉదయం  128వ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం ఆమె షేర్‌ మహమ్మద్‌ పేట నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ్నుంచి గండ్రాయి మీదుగా పాదయాత్ర సాగుతుంది. వల్లభి దగ్గర ఖమ్మం జిల్లాలో ప్రవేశిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. షర్మిల నేడు దాదాపు 13.6 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.

Back to Top