20 మంది కూలీల ప్రాణాలను బలిగొనడం ఎంతవరకు న్యాయం?: వైఎస్ జగన్

హైదరాబాద్: తుపాకులేమీ లేని 20 మంది కూలీల ప్రాణాలను బలిగొనడం ఎంతవరకు న్యాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం కూలీల కాల్చివేత ఘటనపై ఆయన ట్వీట్ చేశారు. ‘‘వారి చేతుల్లో ఎలాంటి తుపాకులు లేనప్పుడు 20 మంది కూలీల ప్రాణాలను తీయడం ఎంతవరకు సమంజసం’’ అని  వైఎస్‌జగన్ తన ట్విటర్ ఖాతాలో ప్రశ్నించారు.
Back to Top