వైయస్ఆర్ వర్థంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు


హైద‌రాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి మహానేత వైయ‌స్ రాజశేఖరరెడ్డి ఏడవ వర్థంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైయ‌స్సార్‌కు ఘనంగా నివాళులర్పించడంతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టాలని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులకు ఒక సర్క్యులర్‌ను జారీ చేశారు. వైయ‌స్ జ్ఞాపకాలను అన్నివర్గాల ప్రజలు స్మరించుకునేలా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అన్ని స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 9 గంటలకు రాజ‌న్నకు నివాళులర్పించిన అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలను, అభిమానులందరినీ సమన్వయ పరుచుకుని అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాల్లో పండ్లు, దుస్తుల పంపిణీ, రక్తదాన, అన్నదాన శిబిరాలు వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించాలని విజయసాయిరెడ్డి కోరారు.
Back to Top