<strong>సత్తెనపల్లి, 4 మార్చి 2013:</strong> రాష్ట్రంలో అసాధారణ విద్యుత్ కోతలకు, పెంచిన కరెంట్ చార్జీలకు నిరసనగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న విద్యుత్ ధర్నా గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా సెంటర్ వద్ద ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఈ మహా ధర్నాలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పాల్గొన్నారు. పార్టీకి చెందిన అనేక మంది నాయకులతో పాటు గుంటూరు జిల్లా నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.<br/>కాగా, సత్తెనపల్లి ముస్లిం సెంటర్ నుంచి సోమవారం ఉదయం పాదయాత్ర ప్రారంభించిన పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ధర్నా ప్రాంతానికి చేరుకుంటున్నారు. శ్రీమతి షర్మిల కూడా ఈ మహా ధర్నాలో పాల్గొంటారు.