శనివారం షర్మిల పాదయాత్ర సాగేదిలా

విజయవాడ, 30 మార్చి 2013

: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పారటీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం  పాదయాత్ర 106వ రోజు శనివారం గోసాల నుంచి ప్రారంభమవుతుందని ఆ పార్టీ కార్యక్రమాల  రాష్ట్ర సమన్వయకర్త  తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. కంకిపాడు, పొద్దుటూరు రోడ్డు, దాములూరు రోడ్డు, చలివేంద్రపాలెం రోడ్డు వరకు పాదయాత్ర సాగిన తరువాత విరామం ఉంటుందన్నారు. అనంతరం పెదఓగిరాల రోడ్డు, ఆకునూరు, చినఓగిరాల రోడ్డు, గండిగుంట, ఉయ్యూరు వరకు పాదయాత్ర సాగుతుందన్నారు. అక్కడే బహిరంగసభ నిర్వహించిన తరువాత సీబీఎం కాంపౌండు వద్ద రాత్రి బస చేస్తారని చెప్పారు.

Back to Top