తీవ్రజ్వరంతో బాధపడుతున్న షర్మిల

ధర్మవరం 27 అక్టోబర్ 2012 :  శుక్రవారంతో సుమారు 131 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన షర్మిల నేడు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే పాదయాత్ర కొనసాగించాల్సిందేనని షర్మిల నిర్ణయించుకున్నారు. దీంతో శనివారం పాదయాత్రను వైద్యుల సూచనల మేరకు 6 కి.మీలకు కుదించారు. మారిన షెడ్యూల్ ప్రకారం ఆమె వసంతాపురం క్రాస్ వద్ద నేటి రాత్రికి బస చేస్తారు.
నిజానికి నేడు షర్మిల హంపాపురం క్రాస్ వద్ద బస చేయాల్సి ఉంది. షర్మిల మరో ప్రజాప్రస్థానం పదవ రోజు పాదయాత్ర అనంతపురం జిల్లాలో గొల్లపల్లి క్రాస్ నుంచి మొదలై, గరుడంపల్లి క్రాస్ మీదుగా వసంతాపురం చేరుకుంటుంది. రేపు (ఆదివారం) చిగిచెర్ల, ఉప్పునేసినపల్లి క్రాస్, హంపాపురం క్రాస్ మీదుగా యాత్ర కొనసాగుతుంది. షెడ్యూలు ప్రకారం షర్మిల శనివారం 13.8 కిలోమీటర్ల మేర నడువవలసి ఉండింది. కానీ జ్వరంలో బాధపడుతున్నందున పాదయాత్రలో కొద్దిపాటి మార్పులు చేశారు.

తాజా వీడియోలు

Back to Top