'సంతకాల సేకరణకు ప్రచార రథాలు'

నెల్లూరు:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి విడుదల కోసం ఇప్పటి వరకు 1.20 లక్షల సంతకాలు సేకరించినట్టు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. లక్షా 20 వేల సంతకాలతో పాటు మరికొన్ని రక్తంతో చేసిన సంతకాలు జతచేసి పంపుతామన్నారు. సంతకాల సేకరణ కోసం రూరల్ నియోజకవర్గంలో 86 చోట్ల శిబిరాలు నిర్వహించామన్నారు. ఐదు ప్రచార రథాలు పని చేశాయన్నారు. 15 రోజుల పాటు కార్యక్రమం నిర్వహించామన్నారు.

కేంద్రం, రాష్ర్టంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు జగన్‌పై కక్ష గట్టి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి ఆయన్ను జైల్లో పెట్టాయని శ్రీధర్ రెడ్డి విమర్శించారు. సంతకాల సేకరణతో ప్రాజాభిప్రాయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆయన చెప్పారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేసినా, సీబీఐ, ఈడీ కలిసి అక్రమ కేసులు బనాయించినా శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి వైపే జనం ఉంటారన్నారు.

Back to Top