<br/>హైదరాబాద్ ) మాస్టర్ ప్లాన్ సమర్పణలోనూ అవినీతి చోటు చేసుకొందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. రాజధాని పేరు చెప్పి గ్రాహిక్ బొమ్మలు చూపిస్తున్నారని ఆమె ఆరోపించారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాజధాని మాస్టర్ ప్లాన్ చూస్తుంటే మగధీర, బాహుబలి ట్రైలర్లు చూస్తున్నట్లుగా ఉందని ఆమె ఎద్దేవా చేశారు మాస్టర్ ప్లాన్ వెనుక లక్ష కోట్ల అవినీతి దాగి ఉందని రోజా ఆరోపించారు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా రాజధాని నిర్మాణం ఎలా సాధ్యమని ఆమె ప్రశ్నించారు. రైతులకు, కూలీలకు చోటు ఎక్కడ అని ఆమె అన్నారు. <br/><br/>